'కృష్ణ వ్రింద విహారి' నుంచి ట్రైలర్ వచ్చేస్తోంది!
- విభిన్న ప్రేమకథా చిత్రంగా 'కృష్ణ వ్రింద విహారి'
- కథానాయికగా షిర్లే సెటియా
- ఈ నెల 10వ తేదీన ట్రైలర్ రిలీజ్
- సంగీత దర్శకుడిగా మహతి స్వరసాగర్
- ఈ నెల 23వ తేదీన సినిమా విడుదల
నాగశౌర్య సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి అనీష్ కృష్ణ దర్శ కత్వం వహించాడు. ఈ సినిమాతో కథానాయికగా షిర్లే సెటియా పరిచయం కానుంది. మహతి స్వరసాగర్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయడానికిగాను తాజాగా ముహూర్తాన్ని ఖరారు చేశారు.
ఈ నెల 10వ తేదీన ఈ సినిమా నుంచి ట్రైలర్ ను వదలనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాను ఈ నెల 23వ తేదీన భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. సరైన హిట్ కోసం కొంతకాలంగా వెయిట్ చేస్తున్న నాగశౌర్యకి ఈ సినిమాతో ఆ ముచ్చట తీరుతుందేమో చూడాలి.
.