Ileana: స్టార్ హీరోయిన్ సోదరుడితో ఇలియానా సహజీవనం?

Ileana in relation with Katrina Kaif brother
  • రెండో సారి ప్రేమలో పడిన ఇలియానా
  • కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ తో రిలేషన్ లో ఉన్న ఇల్లీ
  • బాంద్రాలోని అపార్ట్ మెంట్ లో కలిసి ఉంటున్నట్టు ప్రచారం
గోవా బ్యూటీ ఇలియానా... ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులను తన అందచందాలతో ఉర్రూతలూగించింది. తన తొలి సినిమాతోనే హిట్ కొట్టిన ఇలియానా టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గా చాలా కాలం పాటు కొనసాగింది. కోటి రూపాయలకు పైన రెమ్యునరేషన్ తీసుకున్న తొలి హీరోయిన్ గా చరిత్ర సృష్టించింది. తమిళ సినీ రంగంలో సైతం సత్తా చాటింది. 

దక్షిణాదిలో కెరీర్ పీక్ లో ఉండగానే ఆమె బాలీవుడ్ వైపు అడుగులు వేసింది. ఆ తర్వాత ఆమెకు దక్షిణాదిలో అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. బాలీవుడ్ లో కూడా ఊహించినంతగా అవకాశాలు రాలేదు. ఇదే సమయంలో ఆండ్రూ నీబోన్ అనే ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ తో ఆమె ప్రేమలో పడింది. కొంత కాలంపాటు వీరి ప్రేమాయణం నడిచింది. ఆ తర్వాత విడిపోయారు. ఆ సమయంలో ఆమె డిప్రెషన్ లోకి కూడా వెళ్లిపోయింది. ఆ తర్వాత సినిమాల్లో కూడా సక్సెస్ కాలేకపోయింది. 

మరోవైపు ఇప్పుడు ఆమె మరోసారి ప్రేమలో పడిందని బీటౌన్ టాక్. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ తో ఆమె రిలేషన్ షిప్ లో ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల కత్రినా కైఫ్ పుట్టినరోజు వేడుకలు మాల్దీవుల్లో జరిగాయి. ఈ వేడుకలకు కత్రినా భర్త విక్కీ కౌశల్ తో పాటు సెబాస్టియన్, ఇలియానా కూడా హాజరయ్యారట. దీంతో, వీరి ఎఫైర్ పై వస్తున్న వార్తలకు మరింత బలం చేకూరినట్టయింది. మరోవైపు, బాంద్రాలోని ఓ అపార్ట్ మెంట్లో వీరిద్దరూ కలిసి ఉంటున్నట్టు చెపుతున్నారు.

More Telugu News

Ileana
Love
Katrina Kaif
Brother
Tollywood
Bollywood