తెలంగాణలో తాజాగా 152 మందికి కరోనా పాజిటివ్
- గత 24 గంటల్లో 12,820 కరోనా పరీక్షలు
- హైదరాబాదులో 60 కొత్త కేసులు
- కరోనా నుంచి కోలుకున్న 145 మంది
- ఇంకా 1,011 మందికి చికిత్స
తెలంగాణలో ఇప్పటివరకు 8,35,489 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 8,30,367 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,011 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 4,111 మంది కరోనాతో మృతి చెందారు.
