పైన సోలార్ ప్యానెళ్లు, కింద సైక్లింగ్ ట్రాక్... వరల్డ్ క్లాస్ ట్రాక్‌కు రేపు కేటీఆర్ భూమి పూజ
- నానక్‌రామ్ గూడ సమీపంలో ఏర్పాటు కానున్న ట్రాక్
- తొలి దశలో 23 కిలో మీటర్ల మేర ఏర్పాటు చేస్తున్నామన్న కేటీఆర్
- ట్రాక్ డిజైన్‌పై ఫొటోలు, వీడియో విడుదల చేసిన వైనం
గతంలో ఇచ్చిన హామీ మేరకు ఈ ట్రాక్‌కు మంగళవారం భూమి పూజ చేయనున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. ఈ ట్రాక్ ఎలా ఉండబోతోందన్న దానిపై తెలంగాణ పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్‌తో పాటు కేటీఆర్ కూడా పలు ఫొటోలు, ఓ వీడియోను షేర్ చేశారు. ఈ 23 కిలో మీటర్ల నిడివి కలిగిన ట్రాక్ తొలిదని, భవిష్యత్తులో ఇలాంటి ట్రాక్‌లను నగర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తామని కేటీఆర్ వెల్లడించారు.