అమెరికాలో ఏ తెలుగు సినిమా సాధించని రికార్డును సొంతం చేసుకున్న 'కార్తికేయ 2'
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అమెరికాలో ఏ తెలుగు సినిమా సాధించని రికార్డును సొంతం చేసుకున్న 'కార్తికేయ 2'

Karthikeya 2 record in USA
  • నిఖిల్ కెరీర్లో అతిపెద్ద హిట్ గా నిలిచిన 'కార్తికేయ 2'
  • అమెరికాలో ఇప్పటివరకు 1.5 మిలియన్ డాలర్ల కలెక్షన్స్
  • నాలుగో వారంలో 80కి పైగా లొకేషన్లలో రన్ అవుతున్న తొలి చిత్రంగా గుర్తింపు
ఏ మాత్రం సందడి లేకుండా విడుదలైన 'కార్తికేయ 2' సినిమా ఘన విజయం సాధించింది. హీరో నిఖిల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది, కేవలం తెలుగులో మాత్రమే కాకుండా విడుదలైన ఇతర భాషల్లో సైతం ప్రేక్షకుల మెప్పును పొందింది. బాలీవుడ్ లో సైతం బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. కేవలం మూడు రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కు చేరుకుంది. ఇప్పటి వరకు ఈ సినిమా రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ ను, రూ. 50 కోట్లకు పైగా షేర్ ను సాధించింది. 

మరోవైపు, అమెరికాలో కూడా ఈ సినిమా సత్తా చాటుతోంది. ఇప్పటి వరకు అమెరికాలో 1.5 మిలియన్ డాలర్లను సాధించింది. అంతేకాదు... నాలుగో వారంలో కూడా 80కి పైగా లొకేషన్లలో రన్ అవుతున్న తొలి తెలుగు చిత్రంగా ఈ సినిమా చరిత్ర సృష్టించింది. గతంలో ఏ తెలుగు సినిమా కూడా ఈ ఘనతను సాధించలేదు. ఈ చిత్రంలో నిఖిల్ కు జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటించింది. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్రను పోషించారు.
Karthikeya 2
Tollywood
USA
Record
Nikhil
Anupama Parameshwaran

More Telugu News