తెలంగాణలో తాజాగా 102 మందికి కరోనా
- గత 24 గంటల్లో 8,456 కరోనా పరీక్షలు
- హైదరాబాదులో 60 మందికి పాజిటివ్
- పలు జిల్లాల్లో కొత్త కేసులు నిల్
- కరోనా నుంచి కోలుకున్న 175 మంది
- ఇంకా 1,116 మందికి చికిత్స
తెలంగాణలో ఇప్పటివరకు 8,35,067 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 8,29,840 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,116 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మృతి చెందారు.
