Mahesh Babu: సితారతో కలిసి బుల్లితెరపై కనిపించబోతున్నాను... ఇదో అద్భుతమైన జ్ఞాపకం: మహేశ్ బాబు

Mahesh Babu says for the first time appears in TV along with Sithara
షార్ట్స్‌లో చూడండి
జీ తెలుగు చానల్ లో ప్రసారమవుతున్న డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ తెలుగు షో ఎపిసోడ్ కు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తన కుమార్తె సితారతో కలిసి హాజరయ్యారు. ఈ ఎపిసోడ్ పై తాజాగా మహేశ్ బాబు ట్విట్టర్ లో స్పందించారు. సితారతో కలిసి తొలిసారి ఓ బుల్లితెర షోకి హాజరయ్యానని వెల్లడించారు. ఓ అద్భుతమైన జ్ఞాపకాన్ని అందించినందుకు జీ తెలుగు చానల్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు వెల్లడించారు. 

డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ తెలుగు షోలో పాల్గొంటున్న అందరు పోటీదారులకు శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ ఎపిసోడ్ సెప్టెంబరు 4 (ఆదివారం)న ప్రసారం కానుందని మహేశ్ బాబు వెల్లడించారు. దీనికి సంబంధించిన ప్రోమోను కూడా పంచుకున్నారు.
Go Back to Shorts
Mahesh Babu
Dance India Dance
Sithara
Zee Telugu

More Telugu News