క‌ర్నూలులో శ్రీరామ టాకీస్‌పై ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానుల దాడి... కార‌ణ‌మిదేన‌ట‌!
Add ap7am to your home Screen

క‌ర్నూలులో శ్రీరామ టాకీస్‌పై ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానుల దాడి... కార‌ణ‌మిదేన‌ట‌!

pawan kalyan fans attacked on sri rama talkies in kurnool
  • ప‌వ‌న్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా జ‌ల్సా సినిమా విడుద‌ల‌
  • శ్రీరామ థియేట‌ర్‌లో సినిమాను ప్ర‌ద‌ర్శించిన వైనం
  • సౌండ్ సిస్ట‌మ్ సరిగా లేద‌ని ప‌వ‌న్ అభిమానుల రాళ్ల దాడి
టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులు గురువారం క‌ర్నూలులోని శ్రీరామ టాకీస్‌పై దాడికి దిగారు. ఈ దాడిలో థియేట‌ర్ అద్దాలు ధ్వంస‌మయ్యాయి. ఈ ఘ‌ట‌న‌తో థియేట‌ర్ వ‌ద్ద ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. శుక్ర‌వారం ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని ఓ రోజు ముందుగానే ఆయ‌న న‌టించిన పాత చిత్రం జ‌ల్సాను మ‌రోమారు విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే.

ఈ సినిమా ప్ర‌ద‌ర్శ‌న‌లో భాగంగా శ్రీరామ థియేట‌ర్‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్ భారీ ఎత్తున త‌ర‌లివచ్చారు. సినిమా ప్ర‌ద‌ర్శ‌న‌లో భాగంగా థియేట‌ర్‌లో సౌండ్ సిస్ట‌మ్ స‌రిగా లేద‌ని ప‌వ‌న్ అభిమానులు ఆందోళ‌న‌కు దిగారు. ఈ క్ర‌మంలో థియేట‌ర్ బ‌య‌ట‌కు వ‌చ్చిన ఫ్యాన్స్ రాళ్ల‌తో థియేట‌ర్‌పైకి దాడికి దిగారు. ఈ దాడిలో థియేట‌ర్ పాక్షికంగా ధ్వంస‌మైంది.
Pawan Kalyan
Tollywood
Jalsa
Kurnool
Sri Rama ATalkies
PK Fans

More Telugu News