పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బర్త్ డే స్పెషల్.. సెప్టెంబర్ 2న ‘ఆహా’లో వచ్చేస్తున్న ‘డేగల బాబ్జీ’
Add ap7am to your home Screen

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బర్త్ డే స్పెషల్.. సెప్టెంబర్ 2న ‘ఆహా’లో వచ్చేస్తున్న ‘డేగల బాబ్జీ’

Bandla Ganesh Degala Babji will be premier on sep 2 on Aha
  • కమెడియన్ బండ్ల గణేశ్ ప్రధాన పాత్రలో వచ్చిన డేగల బాబ్జీ
  • తమిళ సినిమా ‘ఉత్త సిరుప్పు సైజు 7’కు రీమేక్
  • పవన్ కల్యాణ్ బర్త్ డేను పురస్కరించుకుని విడుదల చేస్తున్న వైనం 
ఒకప్పుడు కమెడియన్‌గా తెలుగు ప్రేక్షకులను మెప్పించిన నటుడు బండ్ల గణేశ్.. నిర్మాత గానూ పలు సూపర్ డూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించాడు.  ఈ ఏడాది ‘డేగల బాబ్జీ’గా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. తమిళంలో జాతీయ అవార్డు అందుకున్న ‘ఉత్త సిరుప్పు సైజు 7’ను తెలుగులో డేగల బాబ్జీగా రీమేక్ చేశారు. తమిళంలో పార్థీబన్ నటించిన ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది.  

కాగా, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బర్త్ డేను పురస్కరించుకుని సెప్టెంబరు 2న ఆహా ఓటీటీలో ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. వెంకట్ చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాను రిషి అగస్త్య సమర్పణలో యష్ రిషి ఫిలిమ్స్ పతాకంపై స్వాతి చంద్ర నిర్మించారు. 
Bandla Ganesh
Degala Babji
Aha
Pawan Kalyan

More Telugu News