పరశురామ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బన్నీ!
- 'పుష్ప 2' కోసం జరుగుతున్న సన్నాహాలు
- త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న బన్నీ
- ఆయనకి లైన్ చెప్పి ఒప్పించిన పరశురామ్
- మెడికల్ మాఫియా నేపథ్యంలో సాగే కథ
ఈ సినిమా తరువాత బోయపాటితోగానీ .. కొరటాలతో గాని బన్నీ సినిమా ఉంటుందని అంతా అనుకున్నారు. అందుకు కారణం గతంలోనే వాళ్లు ఆయనకి కథ చెప్పి ఒప్పించడం. అయితే వాళ్లతో కంటే ముందుగా పరశురామ్ దర్శకత్వంలో బన్నీ ఒక సినిమా చేయనున్నాడని అంటున్నారు. రీసెంట్ గా ఆయన వినిపించిన లైన్ అందుకు కారణమని అంటున్నారు.
మెడికల్ మాఫియా నేపథ్యంలో పరశురామ్ వినిపించిన లైన్ మరింత ఇంట్రెస్టింగ్ గా అనిపించడంతో, పూర్తి కథను రెడీ చేసి చెప్పమన్నాడని అంటున్నారు. ప్రస్తుతం పరశురామ్ అదే పనిలో ఉన్నాడని చెబుతున్నారు. ఈ లోగా చైతూతో ఆయన ఒక సినిమా చేయవలసి ఉంది. కానీ ఆ ప్రాజెక్టును చైతూ హోల్డ్ లో పెట్టాడనే టాక్ వినిపిస్తోంది.