విజయ్ దేవరకొండ కెరియర్ కి కీలకమైన 'లైగర్'
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విజయ్ దేవరకొండ కెరియర్ కి కీలకమైన 'లైగర్'

Liger movie update
  • 'లైగర్' గా కనిపించనున్న విజయ్  
  •  రెండు ఫ్లాపుల తరువాత  చేసిన సినిమా   
  •  కోవిడ్ వలన పెరిగిన గ్యాప్ 
  • ఈ నెల 25వ తేదీన విడుదల
విజయ్ దేవరకొండ ఇంతవరకూ చేసిన సినిమాలు చాలా తక్కువే. అయితే ఆయనకి వచ్చిన క్రేజ్ ను సినిమాల సంఖ్యతో పోల్చలేం. యాక్టింగ్ విషయాన్ని అలా పక్కనుంచితే, యాటిట్యూడ్ తో ఎక్కువగా ఆకట్టుకున్న హీరో అతను. ఆయన బాడీ లాంగ్వేజ్ ను యూత్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటుంది.

అలాంటి విజయ్ దేవరకొండ చాలా గ్యాప్ తరువాత 'లైగర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అయితే 2018లో 'టాక్సీవాలా' తరువాత విజయ్ దేవరకొండకి ఇంతవరకూ హిట్ లేదు. ఆ సినిమా తరువాత ఆయన చేసిన 'డియర్ కామ్రేడ్' .. 'వరల్డ్ ఫేమస్ లవర్' అభిమానులను పూర్తిగా నిరాశపరిచాయి. 

ఆ వెంటనే ఆయన 'లైగర్' సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ, కోవిడ్ తో పాటు ఇతర కారణాల వలన ఈ సినిమా మూడేళ్ల సమయాన్ని తీసుకుంది. రెండు ఫ్లాపుల తరువాత.. చాలా గ్యాప్ తరువాత విజయ్ దేవరకొండ నుంచి వస్తున్న 'లైగర్' హిట్ కావడమనేది ఆయన కెరియర్ కి చాలా కీలకమే. పాన్ ఇండియా స్థాయిలో ఈ నెల 25న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎలాంటి రిజల్టును రాబడుతుందో చూడాలి.
Vijay ndevarakonda
Ananya panday
Liger Movie

More Telugu News