Sensex: 60 వేల మార్కును దాటిన సెన్సెక్స్.. లాభాల్లో ముగిసిన మార్కెట్లు

Markets ends in profits
షార్ట్స్‌లో చూడండి
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు లాభాలను మూటకట్టుకున్నాయి. ఈరోజు దూసుకుపోయాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు చివరి వరకు క్రమంగా పెరుగుతూనే వచ్చాయి. విదేశీ ఇన్వెస్టర్లు సైతం కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో సూచీలు కళకళలాడాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 418 పాయింట్లు లాభపడి 60,260కి చేరుకుంది. నిఫ్టీ 119 పాయింట్లు పెరిగి 17,944కి ఎగబాకింది. ఆటో, కన్జ్యూమర్ గూడ్స్ సూచీలు మినహా ఇతర సూచీలన్నీ లాభాలను మూటకట్టుకున్నాయి. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఫిన్ సర్వ్ (5.74%), బజాజ్ ఫైనాన్స్ (3.28%), భారతి ఎయిర్ టెల్ (2.55%), టెక్ మహీంద్రా (2.45%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (2.22%). 

టాప్ లూజర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (-1.07%), అల్ట్రాటెక్ సిమెంట్ (-0.65%), మారుతి (-0.58%), టాటా స్టీల్ (-0.44%), కోటక్ బ్యాంక్ (-0.33%).
Go Back to Shorts
Sensex
Nifty
Stock Market

More Telugu News