వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై రూ.10 కోట్ల పరువు నష్టం దావా వేయనున్న ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణ
- వీడియో తొలుత ఏబీఎన్‌లోనే ప్రసారమైందన్న మాధవ్
- తనను దుర్భాషలాడారంటున్న వేమూరి రాధాకృష్ణ
- అందుకు గానూ మాధవ్‌పై న్యాయపరమైన చర్యలకు సిద్ధమైనట్లు వెల్లడి
తాజాగా ఎంపీ మాధవ్ వ్యాఖ్యలను సీరియస్‌గా పరిగణించిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్, ఆంధ్రజ్యోతి పత్రికల యజమాని వేమూరి రాధాకృష్ణ న్యాయపరమైన చర్యలకు సిద్ధమయ్యారు. ఈ వీడియో ప్రసారమైన సందర్భంలో ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా తనను ఎంపీ మాధవ్ దుర్భాషలాడారని రాధాకృష్ణ ఆరోపించారు. అందుకు గాను ఎంపీ మాధవ్‌పై న్యాయపరమైన చర్యలకు రాధాకృష్ణ సిద్ధమయ్యారు. ఎంపీ మాధవ్‌పై రూ.10 కోట్లకు పరువు నష్టం దావా వేసేందుకు రాధాకృష్ణ నిర్ణయించారు. అంతేకాకుండా ఎంపీపై క్రిమినల్, డిఫమేషన్ చర్యలకు కూడా రాధాకృష్ణ సిద్ధమయ్యారు.