Sensex: స్వల్ప నష్టాలలో దేశీయ స్టాక్ మార్కెట్లు

Markets ends in losses
షార్ట్స్‌లో చూడండి
వరుసగా ఐదు సెషన్ల పాటు లాభాల్లో కొనసాగిన మార్కెట్లు ఈరోజు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఉదయం నుంచి మార్కెట్లు ఒడిదుడుకుల్లోనే కొనసాగాయి. వరుస లాభాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 51 పాయింట్లు నష్టపోయి 58,298కి పడింది. నిఫ్టీ 6 పాయింట్లు కోల్పోయి 17,382 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్  
సన్ ఫార్మా (2.46%), నెస్లే ఇండియా (2.39%), ఇన్ఫోసిస్ (2.20%), డాక్టర్ రెడ్డీస్ (1.33%), విప్రో (0.76%). 

టాప్ లూజర్స్
ఎన్టీపీసీ (-3.10%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.46%), రిలయన్స్ (-1.32%), యాక్సిస్ బ్యాంక్ (-1.17%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (1.10).
Go Back to Shorts
Sensex
Nifty
Stock Market

More Telugu News