ఏడేళ్లుగా ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చా: రష్మిక మందన్న

I reached this postion with 7 years hard work says Rashmika Mandanna
  • తాను సాధించిన సక్సెస్ రాత్రికి రాత్రే వచ్చింది కాదన్న రష్మిక 
  • భాషాపరమైన హద్దులను తానెప్పుడూ ఫీల్ కాలేదని వెల్లడి 
  • వివిధ భాషల్లో అవకాశాలు వస్తున్నందుకు సంతోషంగా ఉందని హర్షం 
కన్నడ బ్యూటీ రష్మిక మందన్న స్టార్ మామూలుగా లేదు. టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న రష్మికకు బాలీవుడ్ వెల్ కమ్ పలికింది. ఆమె నటించిన హిందీ చిత్రాలు 'గుడ్ బై', 'మిషన్ మజ్ను' చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. 'వారసుడు', 'యానిమల్' చిత్రాలతో ఆమె బిజీగా ఉంది. 

మరోవైపు ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనకు వచ్చిన సక్సెస్ రాత్రికి రాత్రే వచ్చిందని కాదని చెప్పింది. ఏడేళ్లుగా ఎంతో కష్టపడితే ఈ స్థాయికి వచ్చానని తెలిపింది. ఒక నటిగా భాషాపరమైన హద్దులను తానెప్పుడూ ఫీల్ కాలేదని చెప్పింది. నటనపై పట్టు ఉన్నప్పుడు... తన భావోద్వేగాలను ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పడానికి భాష హద్దుకాదని తెలిపింది. 

కరోనా వల్ల ఆగిపోయిన తన ప్రాజెక్టులన్నింటిని పూర్తి చేసే పనిలో ఉన్నానని రష్మిక చెప్పింది. తన సినిమాలు వచ్చే ఏడాది ఎక్కువగా విడుదలయ్యే అవకాశం ఉందని తెలిపింది. వివిధ భాషల్లో సినిమాలు చేసే అవకాశాలు వస్తున్నందుకు సంతోషంగా ఉందని చెప్పింది.
Go Back to Shorts
Rashmika Mandanna
Tollywood
Bollywood

More Telugu News