దేశంలో మరో రోజూ 20 వేల కరోనా కేసులు
- గత 24 గంటల్లో 20,408 పాజిటివ్ కేసుల నమోదు
- వైరస్ తో తాజాగా 54 మంది మృతి
- వైరస్ నుంచి కోలుకున్న 20,958
రోజువారి పాజిటివిటీ రేటు 5.05 శాతంగా నమోదైంది. క్రియాశీల రేటు 0.33 శాతంగా ఉంది. రికవరీ రేటు 98.48 శాతంగా నమోదైంది. కరోనా నుంచి దేశంలో ఇప్పటిదాకా 4,33,30,442 మంది కోలుకున్నారు. వైరస్ వల్ల 5,26,312 మంది మృతి చెందారు. మరణాల రేటు 1.20 శాతంగా నమోదైంది.
మరోవైపు, దేశంలో ఇప్పటి వరకు 2,03,94,33,408 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. గడచిన 24 గంటల్లో కొత్తగా 33,87,173 మందికి వ్యాక్సిన్ అందజేశారు.