Sensex: దూసుకుపోయిన స్టాక్ మార్కెట్లు... వెయ్యి పాయింట్లకు పైగా లాభపడ్డ సెన్సెక్స్

Sensex gains 1041 points
షార్ట్స్‌లో చూడండి
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు దూసుకుపోయాయి. నిన్న కూడా లాభాల్లో ముగిసన మార్కెట్లు ఈరోజు భారీ లాభాలను మూటకట్టుకున్నాయి. టెక్నాలజీ, ఫైనాన్సియల్ స్టాక్స్ లాభాలను ముందుండి నడిపించాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,041 పాయింట్లు లాభపడి 56,857కి చేరుకుంది. నిఫ్టీ 288 పాయింట్లు పెరిగి 16,930కి ఎగబాకింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఫైనాన్స్ (10.68%), బజాజ్ ఫిన్ సర్వ్ (10.14%), టాటా స్టీల్ (4.59%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (4.34%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (3.90%). 

టాప్ లూజర్స్
భారతి ఎయిర్ టెల్ (-1.19%), అల్ట్రాటెక్ సిమెంట్ (-0.99%), డాక్టర్ రెడ్డీస్ (-0.73%), ఐటీసీ (-0.16%), సన్ ఫార్మా (-0.12%).
Go Back to Shorts
Sensex
Nifty
Stock Market

More Telugu News