'సార్' నుంచి ధనుష్ ఫస్టులుక్ రిలీజ్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'సార్' నుంచి ధనుష్ ఫస్టులుక్ రిలీజ్!

Sir Movie Update
  • ధనుష్ హీరోగా రూపొందిన 'సార్'
  • కథానాయికగా సంయుక్త మీనన్ 
  • సంగీత దర్శకుడిగా జీవీ ప్రకాశ్ కుమార్ 
  • రేపు సాయంత్రం  టీజర్ రిలీజ్   
తమిళంలో స్టార్ హీరోగా ధనుష్ కి మంచి క్రేజ్ ఉంది. తెలుగులో నేరుగా ఒక సినిమా చేయాలని ఆయన అనుకున్నాడు. శేఖర్ కమ్ములతో చేయాలనుకుంటే అందుకు ఇంకా సమయం ఉంది. అందువలన వెంకీ అట్లూరితో సినిమాను ధనుష్ పట్టాలెక్కించాడు. తెలుగులో ఈ సినిమాకి 'సార్' అనీ .. తమిళంలో 'వాతి' అని టైటిల్ ను ఖరారు చేశారు.

తాజాగా ఈ సినిమా నుంచి ధనుష్ ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు. ధనుష్ కాస్తంత కండపట్టి మరింత యంగ్ లుక్ తో కనిపిస్తుండటం విశేషం. మొత్తానికి ఫస్టులుక్ తోనే ఈ సినిమాపై ఆసక్తిని రేకెత్తించాడని చెప్పాలి. సితార - ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ వారు ఈ సినిమాను  నిర్మిస్తున్నారు. 

 జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాలో, ధనుష్ జోడీగా సంయుక్త మీనన్ అలరించనుంది. టీజర్ ను రేపు సాయంత్రం 6 గంటలకు రీలీజ్ చేయనున్నట్టుగా చెప్పారు. ఈ సినిమాతో ధనుష్ టాలీవుడ్ మార్కెట్ ను మరింత పెంచుకుంటాడేమో చూడాలి.
Dhanush
Samyuktha Menon
Sir Movie

More Telugu News