తెలంగాణ హైకోర్టుకు కొత్తగా ఆరుగురు జ‌డ్జీలు... సిఫార‌సు చేసిన కొలీజియం

supreme court collegium appoints 6 new judges to ts high court
  • ఇటీవ‌లే ఏపీ హైకోర్టుకు ఏడుగురు న్యాయ‌మూర్తుల సిఫార‌సు
  • సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ నేతృత్వంలోని కొలీజియం సిఫార‌సు
  • రాష్ట్రప‌తి ఆమోదం త‌ర్వాత న్యాయ‌మూర్తులుగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్న వైనం
ఇటీవ‌లే ఏపీ హైకోర్టుకు ఏడుగురు కొత్త న్యాయ‌మూర్తుల‌ను సిఫార‌సు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం... తాజాగా సోమ‌వారం తెలంగాణ హైకోర్టుకు ఆరుగురు నూతన‌ న్యాయ‌మూర్తుల‌ను సిఫార‌సు చేసింది. సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ నేతృత్వంలోని కొలీజియం తెలంగాణ హైకోర్టుకు సిఫార‌సు చేసిన వారి జాబితాలో ఏనుగుల వెంక‌ట వేణుగోపాల్‌, న‌గేశ్ భీమ‌పాక‌, పుల్ల కార్తీక్‌, కాజా శ‌ర‌త్‌, జ‌గ్గ‌న్నగారి శ్రీనివాస‌రావు, నామ‌వ‌ర‌పు రాజేశ్వ‌ర‌రావులు ఉన్నారు. రాష్ట్రప‌తి ఆమోదం ల‌భించిన వెంట‌నే వీరంతా తెలంగాణ హైకోర్టులో న్యాయ‌మూర్తులుగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు.
Go Back to Shorts
Telangana
TS High Court
Supreme Court
Justice N.V. Ramana
President Of India

More Telugu News