కామారెడ్డి జిల్లాలో మంకీపాక్స్ కలకలం

Monkeypox rage in Kamareddy district
షార్ట్స్‌లో చూడండి
యూరప్ దేశాల్లో మొదలైన మంకీపాక్స్ కలకలం ఇప్పుడు భారత్ కు కూడా పాకింది. ఇప్పటికే దేశంలో నాలుగు పాజిటివ్ కేసులు నమోదు కాగా, తాజాగా తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలోనూ మంకీపాక్స్ కలకలం రేగింది. ఇంద్రనగర్ కాలనీకి చెందిన ఓ వ్యక్తికి మంకీపాక్స్ సోకినట్టు అనుమానిస్తున్నారు. 

ఆ వ్యక్తి ఈ నెల 6న కువైట్ నుంచి వచ్చినట్టు గుర్తించారు. మంకీపాక్స్ అనుమానిత లక్షణాలు ఉండడంతో అతడిని వైద్యులు ఈ నెల 20 నుంచి అబ్జర్వేషన్ లో ఉంచారు. తాజాగా, అతడిని కామారెడ్డి ఏరియా ఆసుపత్రి నుంచి హైదరాబాద్ కు తరలించారు.
Go Back to Shorts
Monkeypox Virus
Kamareddy District
Kuwait
India

More Telugu News