డాక్టర్ వేణు సంకోజుకు దాశ‌ర‌థి కృష్ణ‌మాచార్య అవార్డు

 Venu Sankoju selected for Daasarathi Krishnamacharya award
  • దాశ‌ర‌థి పేరిట అవార్డును ఇస్తున్న తెలంగాణ స‌ర్కారు
  • 2022 ఏడాదికి వేణు సంకోజుకు అవార్డు ప్ర‌క‌ట‌న‌
  • ఈ నెల 22న అవార్డు ప్ర‌దానోత్స‌వం
శ్రీ దాశ‌ర‌థి కృష్ణ‌మాచార్య పేరిట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న అవార్డును 2022కు గానూ ప్ర‌ముఖ క‌వి డాక్టర్ వేణు సంకోజు అందుకోనున్నారు. ఈ మేర‌కు తెలంగాణ ప్ర‌భుత్వం బుధ‌వారం ఓ ప్ర‌క‌ట‌న చేసింది. 'నా తెలంగాణ కోటి రతనాల వీణ' అని నినదించిన తెలంగాణ కవి దాశరథి కృష్ణమాచార్యను స్మ‌రించుకుంటూ తెలంగాణ స‌ర్కారు ఈ అవార్డును ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా 2022 ఏడాదికి సంబంధించి వేణు సంకోజును ఈ అవార్డుకు ఎంపిక చేసిన‌ట్లు తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

ఈ అవార్డు కింద రూ. 1,01,116 (ఒక లక్ష వెయ్యి నూట పదహారు రూపాయలు) నగదు పారితోషకంతో పాటు జ్ఞాపికను వేణు సంకోజుకు ప్ర‌భుత్వం అంద‌జేయ‌నుంది. ఈ అవార్డు ప్ర‌దానోత్స‌వాన్ని ఈ నెల 22న (శుక్ర‌వారం) నిర్వ‌హించ‌నున్న‌ట్లు ప్రభుత్వం ప్ర‌క‌టించింది. న‌ల్ల‌గొండ జిల్లాకు చెందిన డాక్టర్ వేణు సంకోజు ప్ర‌స్తుతం తెలంగాణ రైట‌ర్స్ ఫోర‌మ్ కార్య‌ద‌ర్శిగా కొన‌సాగుతున్నారు.
Go Back to Shorts
Telangana
TRS
Daasarathi Krishnamacharyulu
Venu Sankoju

More Telugu News