Sensex: నేడు కూడా లాభపడ్డ స్టాక్ మార్కెట్లు!

Markets ends in profits
షార్ట్స్‌లో చూడండి
దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు కూడా లాభపడ్డాయి. ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి మార్కెట్లు లాభనష్టాల మధ్య కొట్టుమిట్టాడినప్పటికీ... చివరకు లాభాల్లో ముగిశాయి. బ్యాంకింగ్, ఆటోమొబైల్ స్టాకులు లాభాలను ముందుండి నడిపించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 246 పాయింట్లు లాభపడి 54,768కి చేరుకుంది. నిఫ్టీ 62 పాయింట్లు పెరిగి 16,341 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
యాక్సిస్ బ్యాంక్ (2.35%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.09%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.89%), టాటా స్టీల్ (1.65%), అల్ట్రాటెక్ సిమెంట్ (1.63%).      

టాప్ లూజర్స్:
నెస్లే ఇండియా (-1.37%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.14%), సన్ ఫార్మా (-0.83%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (-0.65%), డాక్టర్ రెడ్డీస్ (-0.38%).
Go Back to Shorts
Sensex
Nifty
Stock Market

More Telugu News