చాలా రోజుల తర్వాత అసెంబ్లీకి వచ్చిన గంటా శ్రీనివాసరావు... ఫొటో ఇదిగో
- చాలా రోజులుగా కనిపించని గంటా
- రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కోసం అసెంబ్లీకి వచ్చిన వైనం
- చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలతో కలిసి వచ్చిన గంటా
తాజాగా సోమవారం రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కోసం గంటా శ్రీనివాసరావు అసెంబ్లీకి వచ్చారు. పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ఇతర సభ్యులతో కలిసి అసెంబ్లీకి వచ్చిన ఆయన రాష్ట్రపతి ఎన్నికల్లో తన ఓటు వేశారు. ఈ ఫొటోనే ఆయనే స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నానని ఆయన తెలిపారు.