Gadikota Srikanth Reddy: శాసనసభా వ్యవహారాల సమన్వయకర్తగా శ్రీకాంత్ రెడ్డి... క్యాబినెట్ హోదా కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
- ఇటీవల మంత్రి పదవి వస్తుందని ప్రచారం
- నూతన మంత్రివర్గంలో శ్రీకాంత్ రెడ్డికి దక్కని చోటు
- తాజాగా కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కారు
ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డిని శాసనసభా వ్యవహారాల సమన్వయకర్తగా నియమించారు. అంతేకాదు, ఆ పదవికి క్యాబినెట్ హోదా కూడా కల్పించారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీకాంత్ రెడ్డి ఈ క్యాబినెట్ హోదాతో రెండేళ్లపాటు పదవిలో కొనసాగుతారు.
శ్రీకాంత్ రెడ్డి... సీఎం జగన్ కు సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. ఇటీవల నూతన మంత్రివర్గంలో ఆయనకు తప్పకుండా స్థానం లభిస్తుందని ప్రచారం జరిగినా, అది కార్యరూపం దాల్చలేదు. ఈ నేపథ్యంలో, శ్రీకాంత్ రెడ్డిని శాసనసభా వ్యవహారాల సమన్వయకర్తగా నియమించడం ప్రాధాన్యత సంతరించుకుంది. శ్రీకాంత్ రెడ్డి కడప జిల్లా రాయచోటి నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.