హైదరాబాద్ లో అదృశ్యమైన బీటెక్ విద్యార్థిని.. ముంబైలో ప్రత్యక్షం
- ముంబైలోని కల్యాణ్ ప్రాంతంలో వర్షిణి గుర్తింపు
- పోలీసు స్టేషన్ కు తరలించిన పోలీసులు
- ఒత్తిడి వల్లే ఇలా చేశానన్న వర్షిణి
- హైదరాబాద్ కు తరలించే ఏర్పాట్లు
ఈ నెల 7న కళాశాలకు వెళ్లిన వర్షిణి ఐడీ కార్డు, మొబైల్ ఫోన్ మర్చిపోయాయని చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చింది. కానీ, ఆమె ఇంటికి తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. వారు దర్యాప్తు ప్రారంభించగా, ముంబైలో ఆమె ఇన్ స్టా గ్రామ్ ఖాతాను యాక్సెస్ చేసినట్టు గుర్తించారు. దీంతో అక్కడి పోలీసులను అప్రమత్తం చేశారు.
ఎట్టకేలకు కల్యాణ్ ప్రాంత పోలీసులు వర్షిణిని గుర్తించి, పీఎస్ కు తరలించారు. డిప్రెషన్ వల్లే తాను ముంబైకి వెళ్లిపోయినట్టు ఆమె చెప్పింది. దీంతో ఆమెను అక్కడి నుంచి హైదరాబాద్ కు తీసుకొచ్చేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు.