Jagan: ప్లీనరీ ప్రాంగణానికి చేరుకున్న జగన్, విజయమ్మ.. ప్లీనరీని ప్రారంభించిన జగన్

Jagan and Vijayamma reaches Plenary
షార్ట్స్‌లో చూడండి
వైసీపీ ప్లీనరీ ప్రాంగణానికి ఆ పార్టీ అధినేత జగన్, గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ చేరుకున్నారు. ఇడుపులపాయలో వైయస్ సమాధి వద్ద జగన్, ఇతర కుటుంబసభ్యులందరూ నివాళి అర్పించారు. అక్కడి నుంచి జగన్, విజయమ్మ గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుని, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ప్లీనరీ వేదిక వద్దకు వచ్చారు. వీరికి పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. ప్లీనరీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి జగన్ నివాళి అర్పించారు. పార్టీ జెండాను ఎగురవేసి, ప్లీనరీని ప్రారంభించారు. మరోవైపు భారీ సంఖ్యలో తరలి వచ్చిన పార్టీ శ్రేణులతో ప్రాంగణమంతా నిండిపోయింది.
Go Back to Shorts
Jagan
YS Vijayamma
YSRCP
Plenary

More Telugu News