టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చాలనుకుంటున్నారు: మోదీపై కేసీఆర్ ఫైర్
- మోదీ పాలనలో మన దేశం గౌరవాన్ని కోల్పోతోంది
- ఇప్పటి వరకు 9 రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేశారు
- ట్రంప్ ను సమర్థించి దేశ ప్రయోజనాలను దెబ్బతీశారు
మీ పాలనలో దేశానికి ఒనగూరింది ఏముందని మోదీని కేసీఆర్ ప్రశ్నించారు. ఇప్పటి వరకు దేశంలో 9 రాష్ట్ర ప్రభుత్వాలను కూలగొట్టారని మండిపడ్డారు. మోదీ కారణంగా శ్రీలంక ప్రజలు రోడ్డెక్కారని అన్నారు. మీ వల్ల ప్రతి విషయంలో దేశం గౌరవాన్ని కోల్పోతోందని విమర్శించారు. అమెరికాలో ట్రంప్ ను మోదీ సమర్థించారని.. ట్రంప్ ను సమర్థించి దేశ ప్రయోజనాలను దెబ్బతీశారని అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చాలనుకుంటున్నారని... మహారాష్ట్రలో చేసినట్టు తెలంగాణలో చేయడం అసాధ్యమని చెప్పారు. పెరుగుతున్న మీ భజన దేశానికి చాలా ప్రమాదకరమని అన్నారు.