దేశంలో కొత్తగా 17వేల మందికి కరోనా వైరస్

India reports 17070 fresh cases
  • మొన్నటితో పోలిస్తే కాస్త తగ్గుదల
  • పాజిటివిటీ రేటు 3.40 శాతం
  • 24 గంటల్లో 23 మంది మృతి
దేశంలో కరోనా కేసుల తీవ్రత కొనసాగుతూనే ఉంది. కొన్నాళ్లుగా రోజు 15 వేల పైచిలుకు కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో 17,070 మందికి వైరస్ సోకినట్టు తేలింది. దాంతో, మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 1,07,189కి చేరుకుంది. క్రియాశీల రేటు 0.25గా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 3.40 శాతంగా ఉంది. 

అయితే, మొన్నటితో పోలిస్తే కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. మొన్న 18,819 కేసులు రాగా.. తాజాగా 1500 కు పైగా కేసులు తగ్గాయి. మరణాల సంఖ్య కూడా కాస్త తగ్గింది. మొన్న 39 మంది మరణించగా... గడచిన 24 గంటల్లో 23 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దాంతో, దేశంలో కరోనా మరణాల సంఖ్య 5,25,139కు చేరుకుంది. మరణాల రేటు 1.21 శాతంగా నమోదైంది.

గడచిన 24 గంటల్లో 14,413 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దాంతో, వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,28,36,906కి చేరుకుంది. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 197.74 కోట్ల పైచిలుకు వ్యాక్సిన్లు అందజేశారు. నిన్న ఒక్క రోజే 11,67,503 డోసులు ఇచ్చారు.
Go Back to Shorts
Corona Virus
COVID19
daily cases

More Telugu News