బీజేపీకి షాక్... టీఆర్ఎస్లో చేరిన నలుగురు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు
- మరో 3 రోజుల్లో హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు
- బీజేపీకి గుడ్ బై చెప్పిన నలుగురు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు
- తాండూరు బీజేపీ ఫ్లోర్ లీడర్‌తో కలిసి బీజేపీలో చేరిక
బీజేపీకి హ్యాండిచ్చేసి టీఆర్ఎస్లో చేరిన కార్పొరేటర్లలో అర్చన ప్రకాశ్, బానోతు సుజాత, వెంకటేశ్, సునీత ప్రకాశ్ గౌడ్లు ఉన్నారు. వీరితో పాటు తాండూరు మునిసిపాలిటీలో బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా వ్యవహరిస్తున్న సింధూజ కూడా బీజేపీని వీడి టీఆర్ఎస్లో చేరిపోయారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో వీరంతా టీఆర్ఎస్ లో చేరారు.