సంక్రాంతికి ముందుగానే బాలయ్య సినిమా రిలీజ్!

Balakrishna and Gopichand Malineni movie update
  • సెట్స్ పై బాలకృష్ణ 107వ సినిమా
  • దర్శకుడిగా గోపీచంద్ మలినేని 
  • ఫ్యాక్షన్ నేపథ్యంలో సాగే కథ 
  • డిసెంబర్ ఫస్టు వీక్ లో రిలీజ్ చేసే ఛాన్స్  
బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. కెరియర్ పరంగా బాలకృష్ణకి ఇది 107వ సినిమా. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి ఇంకా టైటిల్ ను ఖరారు చేయలేదు. ఈ సినిమాలో ఆయన సరసన నాయికగా శ్రుతి హాసన్ నటిస్తోంది.
 
రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ప్రతినాయకుడిగా దునియా విజయ్ నటిస్తున్నాడు. ఆయన పాత్రను డిజైన్ చేసిన తీరు డిఫరెంట్ గా ఉంటుందని అంటున్నారు. బాలకృష్ణకి కరోనా రావడం వలన షూటింగుకి బ్రేక్ ఇచ్చారు. వచ్చేవారం నుంచి షూటింగును మొదలుపెట్టనున్నట్టు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ డిసెంబర్ ఫస్టు వీక్ లోనే ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా చెబుతున్నారు. ఇంతకుముందు బాలకృష్ణ చేసిన 'అఖండ' డిసెంబర్ 2వ తేదీన విడుదలై, సంక్రాంతికి కూడా సందడి చేసిన సంగతి తెలిసిందే.
Go Back to Shorts
Balakrishna
Sruthi Haasan
Gopichand Malineni Movie

More Telugu News