ప్రతిష్ఠాత్మక అవార్డుకు నామినేషన్ పొందిన 'ఆర్ఆర్ఆర్'
- 'హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్'కు నామినేషన్ పొందిన 'ఆర్ఆర్ఆర్'
- పోటీలో ఉన్న మరో 9 హాలీవుడ్ చిత్రాలు
- ఇండియా నుంచి పోటీ పడుతున్న తొలి చిత్రం
మరోవైపు ప్రతిష్ఠాత్మక అవార్డ్ కు ఈ చిత్రం నామినేషన్ పొందింది. 'హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్'కు ఉత్తమ చిత్రం కేటగిరీలో 'ఆర్ఆర్ఆర్' నామినేషన్ పొందింది. ఈ విషయాన్ని 'ఆర్ఆర్ఆర్' టీమ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఉత్తమ సినిమా కేటగిరీలో నామినేషన్ పొందడం సంతోషంగా ఉందని తెలిపింది. ఈ అవార్డ్స్ కు ఇంత వరకు ఏ భారతీయ చిత్రం కూడా పోటీ పడక పోవడం గమనార్హం. ఉత్తమ చిత్రం కేటగిరీలో 'ఆర్ఆర్ఆర్'తో పాటు మరో 9 హాలీవుడ్ చిత్రాలు పోటీపడుతున్నాయి.