Team India: బాధ్యత తీసుకున్నప్పుడల్లా స‌త్తా చాటాను: హార్దిక్ పాండ్యా

hardik pandya talks about t20 series with ireland
షార్ట్స్‌లో చూడండి
ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు టీమిండియా కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఆల్ రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా సిరీస్ ప్రారంభానికి ముందు ఆస‌క్తికర వ్యాఖ్య‌లు చేశాడు. బాధ్య‌త తీసుకున్న‌ప్పుడ‌ల్లా స‌త్తా చాటాన‌ని అత‌డు చెప్పాడు. టీమిండియాకు కెప్టెన్‌గా అవ‌కాశం ద‌క్క‌డాన్ని గౌర‌వంగా భావిస్తున్నాన‌న్న పాండ్యా... ఐర్లాండ్‌తో సిరీస్‌లో రాణిస్తామ‌ని ప్ర‌క‌టించాడు. 

ఐర్లాండ్ జ‌ట్టుతో రెండు టీ20 మ్యాచ్‌ల సిరీస్ కోసం ఇప్ప‌టికే ఆ దేశానికి టీమిండియా చేరుకున్న సంగ‌తి తెలిసిందే. రేపు తొలి టీ20 మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలోనే మీడియాతో హార్దిక్ పాండ్యా మాట్లాడాడు. ఇటీవ‌లే ముగిసిన ఐపీఎల్ సీజ‌న్‌లో తొలిసారి ఎంట్రీ ఇచ్చిన గుజ‌రాత్ టైటాన్స్‌ను విజేత‌గా నిలిపే దిశ‌గా ఆ జ‌ట్టు కెప్టెన్ హోదాలో పాండ్యా స‌త్తా చాటిన సంగ‌తి తెలిసిందే.

ఈ క్ర‌మంలో ఐర్లాండ్‌తో సిరీస్‌కు అటు రెగ్యుల‌ర్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌, ఇటు పార్ట్ టైం కెప్టెన్ రిష‌బ్ పంత్‌లు దూర‌మైన నేప‌థ్యంలో కెప్టెన్సీ ప‌గ్గాలు పాండ్యా చేతికి చిక్కాయి. ఈ సిరీస్‌లో స‌త్తా చాటితే పాండ్యా ప్రాధాన్యం టీమిండియాలో మ‌రింత‌గా పెర‌గ‌నుంద‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి.
Go Back to Shorts
Team India
Ireland
Hardik Pandya

More Telugu News