Sensex: వరుసగా రెండో రోజూ లాభపడ్డ మార్కెట్లు

Markets gains in second straight day
షార్ట్స్‌లో చూడండి
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూలతలు మార్కెట్లకు అండగా నిలిచాయి. చమురు ధరలు తగ్గడం కూడా మార్కెట్లకు కలిసొచ్చింది. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 462 పాయింట్లు లాభపడి 52,728కి చేరుకుంది. నిఫ్టీ 143 పాయింట్లు పెరిగి 15,699 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మహీంద్రా అండ్ మహీంద్రా (4.28%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.59%), బజాజ్ ఫైనాన్స్ (2.58%), హిందుస్థాన్ యూనిలీవర్ (2.30%), ఐసీఐసీఐ బ్యాంక్ (2.02%). 

టాప్ లూజర్స్:
టెక్ మహీంద్రా (-1.3%), ఇన్ఫోసిస్ (-0.77%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-0.50%), టీసీఎస్ (-0.49%), విప్రో (-0.16%).
Go Back to Shorts
Sensex
Nifty
Stock Market

More Telugu News