రేపు ఏపీలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు
- ఉత్తరాంధ్రలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు
- కోస్తాంధ్రలోని 3 జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు
- రాయలసీమలోని శ్రీ బాలాజీ జిల్లాకూ వర్ష సూచన
ఉత్తరాంధ్రలోని అల్లూరి సీతారామరాజు , కాకినాడ , కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాలతో పాటు కోస్తాంధ్రలోని పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంబేద్కర్ తెలిపారు. అదే సమయంలో రాయలసీమలోని శ్రీ బాలాజీ తిరుపతి జిల్లాలోనూ ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఈ కారణంగా ఈ జిల్లాలకు చెందిన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.