Revanth Reddy: ఫాంహౌస్ సీఎం, డమ్మీ హోం మంత్రి అంటూ రేవంత్ రెడ్డి ఫైర్

Revanth reddy fires on KCR
  • ఆడబిడ్డలపై ప్రతిరోజూ అఘాయిత్యాలు జరుగుతున్నాయని రేవంత్ ఆవేదన
  • కేసీఆర్ సొంత పార్టీ, తొత్తు పార్టీ నేతల కొడుకులు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని మండిపాటు
  • సీఎం కనీసం సమీక్ష కూడా నిర్వహించడం లేదని విమర్శ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్ సహా రాష్ట్ర నలుమూలలా ప్రతిరోజూ ఆడబిడ్డలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం సొంత పార్టీ, ఆయన తొత్తు పార్టీ నేతల కొడుకుల ఆగడాలకు ఆడపిల్లలు బలైపోతున్నారని అన్నారు. ఇంతటి దారుణాలు జరుగుతున్నా ఫాంహౌస్ సీఎం, డమ్మీ హోం మంత్రి కనీసం సమీక్ష కూడా చేయకపోవడం ఈ రాష్ట్ర దౌర్భాగ్యమని దుయ్యబట్టారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. రెండు వారాల్లో ఇన్ని అత్యాచారాలా? అంటూ వార్తా పత్రికల్లో వచ్చిన కథనాలను షేర్ చేశారు.
Revanth Reddy
Congress
KCR
TRS

More Telugu News