Sensex: లాభాల్లో ముగిసిన మార్కెట్లు

Markets ends in profits
షార్ట్స్‌లో చూడండి
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి మార్కెట్లు ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ చివరకు లాభాలను మూటకట్టుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 237 పాయింట్లు లాభపడి 51,597కి పెరిగింది. నిఫ్టీ 57 పాయింట్లు పుంజుకుని 15,350 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హిందుస్థాన్ యూనిలీవర్ (3.94%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (3.84%), అల్ట్రాటెక్ సిమెంట్ (3.13%), ఏసియన్ పెయింట్స్ (2.96%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (2.47%). 

టాప్ లూజర్స్:
టాటా స్టీల్ (-5.03%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.60%), రిలయన్స్ (-1.80%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.57%), ఎన్టీపీసీ (-1.57%).
Go Back to Shorts
Sensex
Nifty
Stock Market

More Telugu News