Telangana: తెలంగాణలో మరింత పెరిగిన కరోనా యాక్టివ్ కేసులు

Telangana corona statistics
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణలో గత కొన్నిరోజులగా కరోనా రోజువారీ కేసుల సంఖ్య 200కి పైనే నమోదవుతోంది. దాంతోపాటు కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,912 మంది చికిత్స పొందుతున్నారు. గడచిన 24 గంటల్లో 24,686 కరోనా పరీక్షలు నిర్వహించగా, 247 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. 

అత్యధికంగా హైదరాబాదులో 157 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. రంగారెడ్డి జిల్లాలో 60, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 13 కేసులను గుర్తించారు. అదే సమయంలో 116 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటిదాకా 7,95,819 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,89,796 మంది ఆరోగ్యవంతులయ్యారు. కరోనాతో రాష్ట్రంలో ఇప్పటిదాకా మొత్తం 4,111 మంది మరణించారు.
Go Back to Shorts
Telangana
Corona Virus
Statistics
Active Cases

More Telugu News