ఇంకా ఆసుపత్రిలోనే సోనియా గాంధీ
- ఆమె ఆరోగ్యంపై బులిటెన్ విడుదల చేసిన కాంగ్రెస్
- ఈ నెల 12న ఆసుపత్రిలో చేరిన సోనియా
- కరోనా తర్వాతి సమస్యలకు చికిత్స
- శ్వాసకోశలో ఇన్ ఫెక్షన్ గుర్తింపు
ఈ క్రమంలో సోనియా శ్వాసకోశాల్లో ఇన్ఫెక్షన్ ఉన్నట్టు గుర్తించారని, దానితో పాటు కరోనా తదనంతర సమస్యలకు చికిత్స అందిస్తున్నట్టు వెల్లడించింది. సోనియా ప్రస్తుతం వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఉన్నారని, చికిత్స కొనసాగుతోందని తెలిపింది. ఈ మేరకు ఆలిండియా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి (సమాచారం) జైరాం రమేశ్ లేఖ విడుదల చేశారు.