'సలార్' వచ్చేది అప్పుడేనట!

Salaar movie update
  • షూటింగు దశలో 'సలార్'
  • 30 శాతమే జరిగిన చిత్రీకరణ
  • కథానాయికగా శ్రుతి హాసన్
  • 2023 ఏప్రిల్ 14వ తేదీన రిలీజ్
ప్రభాస్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ 'సలార్' సినిమాను రూపొందిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగు చాలా కాలం క్రితమే మొదలైంది. అయితే మొదలైనంత ఫాస్టుగా షెడ్యూల్స్ పడలేదు. అందుకు కారణం ప్రభాస్ బిజీగా ఉండటమే. ఆయన ఇతర ప్రాజెక్టులపై దృష్టి పెట్టడమే.

ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లినప్పుడు ఈ ఏడాదిలోనే విడుదలవుతుందని అంతా అనుకున్నారు. కానీ ఈ సినిమా ఈ ఏడాదిలో రావడం లేదనేది తాజా సమాచారం. ఇంతవరకూ ఈ సినిమా 30 శాతం మాత్రమే చిత్రీకరణ జరుపుకుంది. మిగతా చిత్రీకరణ పూర్తి చేయడానికి చాలా సమయం పడుతుంది. 

అందువలన వచ్చే ఏడాది ఏప్రిల్ 14వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన కథానాయికగా శ్రుతి హాసన్ అలరించనున్న సంగతి తెలిసిందే. ఇక ఆల్రెడీ 'ఆది పురుష్'ను పూర్తిచేసిన ప్రభాస్, ప్రస్తుతం 'ప్రాజెక్టు K' పనులతో బిజీగా ఉన్నాడు.
Go Back to Shorts
Prabhas
Sruthi Haasan
Salaar Movie

More Telugu News