నవీన్ కుమార్ జిందాల్ కు, మా బాస్ నవీన్ జిందాల్ కు సంబంధం లేదు: జిందాల్ స్టీల్స్ స్పష్టీకరణ
- మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు చేసిన నవీన్ కుమార్ జిందాల్
- సస్పెండ్ చేసిన బీజేపీ
- మీడియాలో జిందాల్ స్టీల్స్ అధినేత నవీన్ జిందాల్ ఫొటోలు
- ఓ ప్రకటన చేసిన జిందాల్ స్టీల్స్
ఇది ఓ వ్యక్తిని మరో వ్యక్తిగా పొరబడడమేనని, ఇలాంటి చర్యలకు మీడియా దూరంగా ఉండాలని సూచించింది. నవీన్ కుమార్ జిందాల్ కు, తమ బాస్ నవీన్ జిందాల్ కు ఎలాంటి సంబంధంలేదని జిందాల్ స్టీల్స్ స్పష్టం చేసింది. మీడియా ఈ విషయాన్ని అర్థం చేసుకుని, సహకరిస్తుందని ఆశిస్తున్నామని పేర్కొంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.