ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ
- జూన్ 2న సోనియాకు కరోనా పాజిటివ్
- ఈడీ విచారణకు గైర్హాజరు
- ఇంటివద్దే ఐసోలేషన్
- కరోనా సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వైనం
ప్రస్తుతం సోనియా ఆరోగ్యం నిలకడగానే ఉందని, వైద్యులు ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నందున ఆమె ఆసుపత్రిలోనే ఉంటారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిది రణదీప్ సూర్జేవాలా వెల్లడించారు. సోనియా ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ సందేశాలు పంపిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నారు.