ప్రభాస్ 'సలార్' టీజర్ ముహూర్తం ఖరారు.. ఎప్పుడు రిలీజ్ అవుతోందంటే..!
- ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'సలార్'
- ప్రభాస్ సరసన నటిస్తున్న శృతి హాసన్
- జులై రెండో వారంలో విడుదల కానున్న టీజర్
తాజాగా ఈ చిత్రం టీజర్ కు సంబంధించి ఒక లేటెస్ట్ అప్ డేట్ వచ్చింది. జులై రెండో వారంలో టీజర్ విడుదల కాబోతోందని, దీనికి సంబంధించి త్వరలోనే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రానుందట. యాక్షన్ సీక్వెన్సుల్లోని కొన్ని షాట్స్ ను ఈ టీజర్ లో చూపించబోతున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శృతి హాసన్ నటిస్తోంది. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవికి ఈ చిత్రాన్ని తీసుకొచ్చేందుకు మేకర్స్ సన్నాహకాలు చేస్తున్నారు.