కమల్ ను సన్మానించిన చిరంజీవి .. సందడి చేసిన సల్మాన్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కమల్ ను సన్మానించిన చిరంజీవి .. సందడి చేసిన సల్మాన్!

Kamal and Salman Khan in Chiranjeevi party
  • తన నివాసంలో పార్టీ ఇచ్చిన చిరంజీవి
  • 'విక్రమ్' విజయం నేపథ్యంలో కమల్ ను సన్మానించిన చిరు
  • కమల్ ను సన్మానించడం సంతోషంగా ఉందన్న మెగాస్టార్
విలక్షణ నటుడు, తన చిరకాల మిత్రుడు కమలహాసన్ ను మెగాస్టార్ చిరంజీవి సన్మానించారు. తన తాజా చిత్రం 'విక్రమ్' ఘన విజయం సాధించడంతో కమల్ సంతోషంగా ఉన్నారు. ప్రస్తుతం హైదరాబాదులో ఉన్న కమల్ ను చిరంజీవి తన నివాసానికి ఆహ్వానించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ సందడి చేశారు. కమల్ కు చిరంజీవి శాలువా కప్పి, పుష్పగుచ్ఛాన్ని అందించి సన్మానించారు. 'విక్రమ్' దర్శకుడు కనకరాజ్ ను కూడా చిరు అభినందించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా చిరంజీవి తెలిపారు. 

సినిమా విజయాన్ని అభినందిస్తూ తన ప్రియ మిత్రుడు కమల్ హాసన్ ను సన్మానించడం ఆనందంగా ఉందని చిరంజీవి అన్నారు. కమల్, సల్మాన్ ఖాన్, డైరెక్టర్ కనకరాజ్, 'విక్రమ్' సినిమాకు చెందిన ఇతర టీమ్ సభ్యులకు నిన్న రాత్రి తన నివాసంలో పార్టీ ఇచ్చానని చెప్పారు. మై డియర్ ఫ్రెండ్ 'విక్రమ్' ఒక అద్భుతమైన సినిమా అని ప్రశంసించారు. నీవు మరింత శక్తిమంతం కావాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఈ సినిమా తనకు ఎంతో నచ్చిందని చెప్పారు. మరోవైపు 'కభీ ఈద్ కభీ దీవాలీ' సినిమా షూటింగ్ కోసం సల్మాన్ ఖాన్ ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నారు.


Chiranjeevi
Kamal Haasan
Salman Khan
Party

More Telugu News