అబుదాబి వెళ్లేందుకు నటి జాక్వెలిన్‌కు షరతులతో కూడిన అనుమతి
- రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో సుకేష్ చంద్రశేఖర్‌తో జాక్వెలిన్‌కు సంబంధాలు
- విదేశాలకు వెళ్లకుండా లుక్ అవుట్ నోటీసులు
- ఈ నెల 31 నుంచి జూన్ 6 వరకు ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్
- రూ. 50 లక్షల పూచీకత్తు సమర్పించి వెళ్లొచ్చంటూ కోర్టు అనుమతి
అయితే, అబుదాబిలో జరగనున్న ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్‌లో పాల్గొనాల్సి ఉందని, కాబట్టి వెళ్లేందుకు తనను అనుమతించాలని కోరుతూ జాక్వెలిన్ కోర్టును ఆశ్రయించింది. అబుదాబిలో తాను ఏ హోటల్లో బస చేయబోతున్నదీ సంబంధిత వివరాలను సమర్పించింది. పరిశీలించిన న్యాయస్థానం ఆమెపై ఉన్న లుక్ అవుట్ సర్క్యులర్ (LOC)ని కొట్టివేస్తూ అబుదాబి వెళ్లేందుకు అనుమతినిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అలాగే, రూ. 50 లక్షల డిపాజిట్‌ను పూచీకత్తుగా సమర్పించాలని షరతు విధించింది. తిరిగి భారత్ చేరుకున్నాక ఆ విషయాన్ని దర్యాప్తు సంస్థకు తెలియజేయాలని సూచించింది.