Sensex: వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

Markets ends in losses
షార్ట్స్‌లో చూడండి
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిశాయి. ఐటీ, ఫార్మా, కన్జ్యూమర్ గూడ్స్ స్టాకులు ఈరోజు మార్కెట్లను వెనక్కి లాగాయి. అంతర్జాతీయంగా ఎలాంటి సానుకూలతలు లేకపోవడం మార్కెట్లపై ప్రభావం చూపింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 236 పాయింట్లు నష్టపోయి 54,052కి పడిపోయింది. నిఫ్టీ 89 పాయింట్లు కోల్పోయి 16,125 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (1.80%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (1.74%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (1.35%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (1.23%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (1.09%). 

టాప్ లూజర్స్:
టెక్ మహీంద్రా (-3.92%), హిందుస్థాన్ యూనిలీవర్ (-2.98%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-2.57%), ఏసియన్ పెయింట్స్ (-2.33%), ఎన్టీపీసీ (-2.10%).
Go Back to Shorts
Sensex
Nifty
Stock Market

More Telugu News