Allu Arjun: మురుగదాస్ వైపు మొగ్గు చూపుతున్న బన్నీ!

Allu Arjun in Muruga Doss movie
షార్ట్స్‌లో చూడండి
తెలుగు .. తమిళ భాషల్లో స్టార్ డైరెక్టర్ గా మురుగదాస్ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. స్టార్ హీరోలతో భారీ విజయాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. కోలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ తన టేకింగ్ కి ఎక్కువ మార్కులు తెచ్చుకున్న దర్శకుడాయన. ఆయన కథలను అందించిన అన్ని సినిమాలు ఇతర భాషల్లోను సంచలన విజయాలను నమోదు చేయడం విశేషం.

అలాంటి ఆయన దర్శకత్వంలో చేయడానికి బన్నీ మొగ్గుచూపుతున్నాడని అంటున్నారు. లైకా ప్రొడక్షన్స్ వారు బన్నీతో  ఒక ప్రాజెక్టును అనుకున్నారు. ఈ సినిమా కోసం అట్లీ కుమార్ ను తీసుకోనున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ ప్లేస్ లో మురుగదాస్ పేరు వినిపిస్తోంది.

మురుగదాస్ పేరు సిఫార్స్ చేసింది బన్నీయేనని అంటున్నారు. ఇక అట్లీ డిమాండ్ చేసిన పారితోషికం కారణంగా మేకర్స్ కూడా మురుగదాస్ ను రంగంలోకి దింపే ఆలోచన చేస్తున్నారని వినికిడి. అయితే 'పుష్ప 2' తరువాత బన్నీ తదుపరి సినిమా బోయపాటితో  ఉంటుందో .. మురుగదాస్ తో ఉంటుందో చూడాలి.
Go Back to Shorts
Allu Arjun
Sukumar
Muruga Doss

More Telugu News