Sensex: నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

Markets ends in losses
  • 109 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 19 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • నాలుగున్నర శాతం వరకు నష్టపోయిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్
నిన్న భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాలను మూటకట్టుకున్నాయి. ఈరోజు కూడా మధ్యాహ్నం వరకు మార్కెట్లు భారీ లాభాల్లోనే కొనసాగాయి. అయితే, మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో మార్కెట్లు నష్టపోయాయి. దీంతో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 109 పాయింట్లు నష్టపోయి 54,208కి పడిపోయింది. నిఫ్టీ 19 పాయింట్లు కోల్పోయి 16,240 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హిందుస్థాన్ యూనిలీవర్ (2.02%), అల్ట్రాటెక్ సిమెంట్ (1.98%), ఏసియన్ పెయింట్స్ (1.65%), సన్ ఫార్మా (0.78%), ఐటీసీ (0.72%). 

టాప్ లూజర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-4.55%), టెక్ మహీంద్రా (-2.14%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-2.01%), ఎల్ అండ్ టీ (-1.92%), బజాజ్ ఫిన్ సర్వ్ (-1.66%).

More Telugu News

Sensex
Nifty
Stock Market