నా ఇంటికి వచ్చే అర్హత ఏ బాలీవుడ్ స్టార్ కి లేదు: కంగనా రనౌత్
- తనతో నటించేందుకు బాలీవుడ్ స్టార్లు ఇష్టపడరన్న కంగన
- తనతో నటించేవారిని బాలీవుడ్ సెలబ్రిటీలు టార్గెట్ చేస్తారని వ్యాఖ్య
- అర్జున్ రాంపాల్ తనతో నటించడం నిజంగా గ్రేట్ అని కితాబు
తన ఇంటికి వచ్చే అర్హత ఏ బాలీవుడ్ స్టార్ కు గానీ, ఏ బీటౌన్ సెలబ్రిటీకి కానీ లేదని కంగన తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తనను వీరెవరైనా బయట కలిస్తే పర్వాలేదని... తాను మాత్రం వీరెవరినీ తన ఇంటికి ఆహ్వానించనని చెప్పింది.
కంగన తాజా చిత్రం 'ధాకడ్' ఈ నెల 20న విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో ఆమె స్టార్ హీరోలకు ఏమాత్రం తగ్గని రీతిలో యాక్షన్ సీన్లలో నటించింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో ఆమె బిజీగా ఉంది. అందులో భాగంగా తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేసింది. కంగన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం బీటౌన్ లో చర్చనీయాంశంగా మారాయి.