బీజేపీ నేత చెంప చెళ్లుమ‌నిపించిన ఎన్సీపీ కార్య‌క‌ర్త‌... వీడియో ఇదిగో

BJP Leader Slapped by NCP Workers
  • ప‌వార్‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన వినాయ‌క్‌
  • ఇప్ప‌టికే అంబేక‌ర్‌పై పోలీసు కేసు న‌మోదు
  • తాజాగా ఆయ‌నపై దాడి చేసిన ఎన్సీపీ కార్య‌క‌ర్త‌లు
నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శ‌ర‌ద్ ప‌వార్‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన మ‌హారాష్ట్రకు చెందిన బీజేపీ నేత వినాయ‌క్ అంబేక‌ర్‌పై ఎన్సీపీ శ్రేణులు దాడికి పాల్ప‌డ్డాయి. అంబేక‌ర్ కార్యాల‌యానికి వెళ్లిన ఎన్సీపీ కార్య‌కర్త‌లు తొలుత ఆయ‌న‌తో వాగ్వాదానికి దిగారు. వారి ప్ర‌శ్న‌ల‌కు కుర్చీలో కూర్చునే స‌మాధానం ఇస్తున్న వినాయ‌క్‌పై ఉన్న‌ప‌ళంగా ఎన్సీపీకి చెందిన ఓ కార్య‌క‌ర్త చేయి చేసుకున్నారు. 

వినాయ‌క్ చెంప‌పై ఎన్సీపీ కార్య‌క‌ర్త కొట్టారు. ఈ ఘ‌ట‌న మొత్తం రికార్డ్ కాగా... సోష‌ల్ మీడియాలో ఈ వీడియో వైర‌ల్‌గా మారిపోయింది. ప‌వార్‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన అంబేక‌ర్‌పై ఇప్ప‌టికే పోలీసులు కేసు న‌మోదు చేసిన సంగ‌తి తెలిసిందే.
Go Back to Shorts
BJP
Maharashtra
NCP
Sharad Pawar

More Telugu News