KGF: కేజీఎఫ్ 3.. అంతా తూచ్.. వట్టిదే!

As Of Now KGF3 not on our Cards
షార్ట్స్‌లో చూడండి
బాక్సాఫీస్ వద్ద పెను సంచలనం కేజీఎఫ్. ఈ ఏడాది దానికి సీక్వెల్ విడుదలై అంతకు మించిన ఉప్పెననే సృష్టించిందా సినిమా. అయితే, నిన్నటి నుంచి పార్ట్ 2కు కొనసాగింపుగా పార్ట్ 3 వస్తుందన్న కథనాలు బాగా వినిపిస్తున్నాయి. కేజీఎఫ్ 3కి సంబంధించిన కథా నిర్మాణం జరుగుతోందని, ఈ ఏడాది నవంబర్ నుంచే సినిమాను ప్రారంభిస్తామని కేజీఎఫ్ నిర్మాత విజయ్ కిరగందూర్ చెప్పినట్టు నిన్న వార్తలు తెగ హల్ చల్ చేశాయి. దీంతో అదో ట్రెండ్ అయిపోయింది. 

అయితే, తాజాగా ఇవాళ ఆ కథనాలపై కేజీఎఫ్ నిర్మాణ సంస్థ ‘హోంబలే’కు చెందిన మరో నిర్మాత కార్తీక్ గౌడ స్పందించారు. అవన్నీ వట్టి వార్తలంటూ కొట్టిపారేశారు. సోషల్ మీడియాలో వస్తున్న కథనాల్లో నిజం లేదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం తమ చేతిలో ఎన్నో అద్భుతమైన చిత్రాలున్నాయని, వాటిపైనే దృష్టి పెట్టామని చెప్పారు. ఇప్పట్లో కేజీఎఫ్ 3ని పట్టాలెక్కించే అవకాశాల్లేవని పేర్కొన్నారు. ఒకవేళ సినిమా ఉంటే షూటింగ్ ఎప్పట్నుంచన్నది అధికారికంగా ప్రకటిస్తామని ఆయన స్పష్టం చేశారు.
Go Back to Shorts
KGF
Tollywood
Bollywood
Kollywood
Yash
KGF3

More Telugu News